ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలకు శుభవార్త చెప్పారు. వలస కూలీలకు చేతి ఖర్చుల కొరకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చేతి ఖర్చుల కింద ఒక్కో కూలీకి 500 రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎవరైనా సొంతూళ్లకు వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉంటారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు. 
 
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారు తిరుపతి, విజయవాడ, విశాఖ ఎయిర్ పోర్టులకు చేరుకున్న తరువాత వారికి అక్కడే థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. అనంతరం వారిని అక్కడినుంచి క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని చెప్పారు. ఈరోజు ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. 
 
ఇతర రాష్ట్రాల్లో ఉన్న కూలీలకు అవసరమైన పక్షంలో ప్రయాణ సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: