దేశంలో కరోనా ఎప్పుడైతే ప్రవేశించిందో అన్నీ బంద్..బంద్. మార్చి 24 నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టడంతో థియేటర్లు, మాల్స్, ఇతర జనసంద్రంగా ఉండే ప్రదేశా లన్నీ మూసివేశారు.   కరోనా కారణంగా దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. దీంతో, అనునిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ప్రముఖ ఆలయాలు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్నాయి.  నిత్యం భక్తులతో  ఎంతో వైభవంగా వెలిగిపోయే ఆలయాలు ఇప్పుడు వెల వెల బోతున్నాయి.  కోట్ల ఆదాయం గండి పడుతుంది.  ఇక సాయినాథుడికి  ప్రతి రోజు రూ. 1.5 కోట్లకు పైగా ఆదాయాన్ని నష్టపోతోంది. మార్చ్ 17 నుంచి మే 3వ తేదీ వరకు ఆన్ లైన్ డొనేషన్ల రూపంలో ఆలయానికి రూ. 2.53 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది.

 

మన దేశంలో ఫిబ్రవరి నుంచే కరోనా ప్రభావం మొదలైంది.. దాంతో మార్చి నెలలో ఈ కేసులు పెరగడంతో లాక్ డౌన్ మొదలు పెట్టారు.  అంటే రోజుకు దాదాపు రూ. 6 లక్షలు మాత్రమే వచ్చినట్టు లెక్క. ఇక వాస్తవానికి షిర్డీ ఆలయానికి విరాళాల రూపంలో ఏడాదికి రూ. 600 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అంటే ప్రతిరోజు సరాసరి రూ. 1.64 కోట్ల ఆదాయం వస్తుందన్నమాట. అయితే లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ఈ ఆదాయం ఆగిపోయింది. అంటే ప్రతి రోజు రూ. 1.58 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే టెంపుల్ ట్రస్ట్ ఏకంగా రూ. 150 కోట్ల మేర నష్టపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: