తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నేటి నుంచి మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాదాపు 40 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర మందుబాబులు బారులు తీరారు. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ మద్యం కొనుగోలు చేశారు. పలు చోట్ల మహిళలు సైతం మద్యం కొనుగోలు చేయడం గమనార్హం. 
 
అయితే రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతో మందుబాబులు సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ చెబుతూ పాలాభిషేకం చేశారు. మందుబాబులు కేసీఆర్ కు పూజలు కూడా చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో మద్యం దుకాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: