తెలుగు లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రలో కనిపించిన తర్వాత నాని నటించిన ఎవడే సుబ్రమాణ్యం మూవీలో స్నేహితుడిగా నటించాడు.  తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘పెళ్లిచూపులు’ మూవీలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నడు. ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ మూవీతో సెన్సేషన్ హీరోగా మారిపోయాడు.  అప్పటి నుంచి వరుస విజయాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ ఇప్పుడు లాక్ డౌన్ సందర్భంగా ఎంతో మంది పేదలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇలాంటి సమయంలో కొన్ని వెబ్ సైట్లు తనపై తప్పుడు వార్తలు రాస్తూ, తన కెరీర్ ను నాశనం చేస్తున్నాయంటూ హీరో విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ కు చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అండగా నిలబడుతున్నారు.

 

తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా తన మద్దతును ప్రకటించింది. ఈ సందర్బంగా ‘మా’ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో విజయ్ దేవరకొండ ఒక ఛారిటీని పెట్టి పేదలకు ఆసరాగా నిలిచే ప్రయత్నం చేశారని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసు చేసుకొని అందరిలో చైతన్యం కలిపిస్తూ... సీ.సీ.సీ. స్థాపించారు. విజయ్ దేవరకొండ సీసీసీకి కూడా విరాళం ఇచ్చారని తెలిపారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనుకుంటున్న విజయ్ పై బురదచల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. విజయ్ దేవరకొండకు అసోసియేషన్ మద్దతుగా ఉంటుందని చెప్పారు. ఇండస్ట్రీలో అందరూ అన్నదమ్ములమేనని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: