ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్రం సూచనల మేరకు లాక్ డౌన్ లో భారీ సడలింపులు అమలులోకి వచ్చాయి. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో దుకాణాలు తెరచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. గత 40 రోజులుగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా పాటించడం లేదు. 
 
మాస్కులు ధరించకుండా పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రజలు రోడ్లపైకి వస్తూ ఉండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజల్లో అభిప్రాయాలు వ్యక్త్మవుతున్నాయి. మరికొన్ని రోజులు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినా ఏపీలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: