విశాఖలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమలో వాయువు లీకైంది. కెమికల్ గ్యాస్ పీల్చిన వారిలో ఇద్దరు మృతి చెందగా 200 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారిని తరలిస్తూ ఆంబులెన్స్ లోనే డ్రైవర్ స్పృహ తప్పి పడిపోయారు. గ్యాస్ పీల్చిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 
 
గ్యాస్ లీక్ కావడంతో చాలామంది తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. పోలీసులు సైరన్ మోగించి స్థానిక ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపై పడిపోయారు. పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని ఆంబులెన్స్‌లో కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని వేర్వేరు ఆసుపత్రికి తరలించారు. 
 
లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: