విశాఖలోని ఎల్జీ పాలీమర్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ నుంచి స్టేరైన్ అనే కెమికల్ గ్యాస్ లీకైంది. ఈ గ్యాస్ కారణంగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
ఈ గ్యాస్ కారణంగా అస్వస్థతకు గురైన ప్రజలు కళ్ళ మంటలు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు,  సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేయడానికి మరో రెండు గంటలు పట్టే అవకాశం ఉంది. గ్యాస్ లీకేజీ వల్ల విశాఖలోని వందలాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. 
 
సీఎం జగన్ ఈ ఘటన గురించి అధికారులను ఆరా తీశారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ వినయ్ చంద్ కు ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: