విశాఖలోని ఎల్.జీ పరిశ్రమలో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంకటాపురం పరిశ్రమలో లీకైన స్టేరైన్ గ్యాస్ మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. లీకైన గ్యాస్ పీల్చడంతో కొందరు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు అపస్మారక స్థితిలో రోడ్లపైనే పడిపోయారు. 
 
కెమికల్ గ్యాస్ పీల్చిన పశువులు నురగలు కక్కుతూ నేలకొరిగాయి. వందలాది పశువులు మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. వెంకటాపురం, గోపాలపురం గ్రామాలపై కెమికల్ గ్యాస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గ్యాస్ లీకేజ్ ఇప్పటికీ కంట్రోల్ లోకి రాలేదు. గ్యాస్ లీకేజ్ ను కంట్రోల్ చేయడానికి మరో రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. చుట్టుపక్కల గ్రామాలన్నీ కమ్మేస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
అయితే గ్యాస్‌ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: