విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ గ్యాస్ లీకేజీకి కార‌ణం ఏమిటి..?  కార‌కులు ఎవ‌రు..? అనే అంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవల కాలం వరకు లాక్ డౌన్ లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , వంద‌ల సంఖ్య‌లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు 3 కిలోమీటర్ల​ మేర వ్యాపించింది. మ‌రో రెండు రోజుల పాటు దీని ప్ర‌భావం ఉండే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నాయి. అయితే.. నిజానికి సౌత్ కొరియాకు చెందిన ఈ ఈ ఎల్‌జీ పాలిమ‌ర్స్ కంపెనీ సుమారు 15ఏళ్ల కింద‌ట హిందుస్తాన్ కంపెనీ నుంచి తీసుకుంది. గ‌తంలోనే ఉన్న ముంబై సంస్థ‌ను టేకోవ‌ర్ చేసింది.

 

అయితే.. త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. అనుభ‌వం ఉన్న వాళ్ల‌ను తీసేసి అనుభ‌వం లేనివాళ్ల‌ను కంపెనీలో పెట్టుకున్న‌ట్లు ప‌లువురు ఆరోపిస్తున్నారు. నిజానికి.. సౌత్ కొరియా కంపెనీ అంటే.. ఎంతో అత్యాధునిక వ‌స‌తులు ఉంటాయ‌ని అంద‌రూ భావిస్తారు. కానీ.. ఈ కంపెనీలో మాత్రం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌ని ప‌లువురు అంటున్నారు. నిజానికి.. ప్ర‌స్తుతం ఇదే సౌత్ కొరియ‌న్ కంపెనీల్లో గ్యాస్ లీకైనా.. ఆటోబ్లాక్ సిస్ట‌మ్ ఉంటుంద‌ని, వెంట‌నే కంపెనీ త‌లుపులు కూడా వాటిక‌వే మూసుకుంటాయ‌ని, సైరెన్ సిస్ట‌మ్ ఉంటుంద‌ని చెబుతున్నారు. కానీ.. విశాఖ ఎల్‌జీ పాలిమ‌ర్స్ కంపెనీలో మాత్రం ఇలాంటి టెక్నాల‌జీని కంపెనీ ఉప‌యోగించ‌లేదుని అంటున్నారు. వంద‌ల బిలియ‌న్ డాల‌ర్ల లాభాలు పొందే ఈ కంపెనీ.. ఈ క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌ని ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు కంపెనీ బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: