విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో వందలాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ఘటనతో విశాఖ నగరం అంతా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ గ్యాస్ ప్రభావంతో కళ్లు కనిపించక ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తే క్రమంలో గంగరాజు అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందగా, మరో వ్యక్తి ఊపిరాడక మృతి చెందినట్టు సమాచారం. 
 
మరో వ్యక్తి విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. కొందరు బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోవడంతో పోలీసులు వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. కెమికల్ గ్యాస్ పీల్చి నురగలు కక్కుతూ పశువులు నేలకొరిగాయి. లాక్ డౌన్ లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై అధికారులు స్పందించి సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. సీఎం జగన్ ఈ ఘటనపై ఆరా తీసి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: