విశాఖప‌ట్ట‌ణంలోని గోపాలపట్నంలో గ‌ల ఎల్జీ పాలిమర్స్‌లో భారీగా గ్యాస్‌ లీక్‌ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఒక్క సారిగా 5 కిలోమీటర్ల మేర విష వాయువు వ్యాపించింది. దీంతో వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్ర‌మాదంలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా,  అన‌ధికార లెక్కల ప్ర‌కారం 15 మంది చ‌నిపోయి ఉంటార‌ని తెలుస్తోంది. ఇంకా మ‌ర‌ణాల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటున్నారు.  సుమారు 2000  మంది కి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చిన్నారులు, వృద్ధులే అధికంగా ఉన్నారు. 

 

ఫ్యాక్టరీ నుంచి ప్ర‌స్తుతానికి గ్యాస్ లీకేజీ ఆగిపోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌తో 5 గ్రామాల ప్ర‌జ‌లు ఊరు ఖాళీ చేసి వెళ్లారు. విష వాయువు ప్ర‌భావంతో ప‌శువులు, ప‌క్షులు కూడా కుప్ప‌కూలుతున్నాయి.  పాలిమర్స్‌ బాధితులతో కేజీహెచ్‌ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: