విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య పదికి చేరింది. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దాదాపు 2000 మంది ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. గ్యాస్ లీకేజీ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. సంఘటన జరిగిన వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందగా విశాఖలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. 
 
రోడ్లపై పదుల సంఖ్యలో ప్రజలు అపస్మారక స్థితిలో పడిపోయారు. వారిని ఆస్పత్రులకు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్యాస్ లీకేజీ ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇద్దరు గ్యాస్ లీక్ వల్ల కళ్లు కనినపించక బావిలో పడిపోగా.. మరొకరు గ్యాస్‌తో ఊపిరాడక ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో చాలామంది ఇళ్లల్లో చిక్కుకుపోయారు. సీఎం జగన్  మరికాసేపట్లో విశాఖకు చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు. గ్యాస్ లీక్ కావడంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: