విశాఖలో పెద్ద ప్ర‌మాదానికి కార‌ణ‌మైన స్టెరీన్ ప్ర‌భావం చాలా తీవ్రంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ గ్యాస్ ప్ర‌మాదం నేప‌థ్యంలో విశాఖ న‌గ‌రంలో వంద‌ల మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. ఈ స్టెరీన్ గ్యాస్ వాయువు మొద‌డు, నాడీ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని చెపుతున్నారు. అలాగే ఊపిరి తిత్తుల‌పై వెంట‌నే ప్ర‌భావం చూప‌డంతో ఊపిరి ఆడ‌క తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యి వెంట‌నే కోమాలోకి వెళ్ల‌డం లేదా చ‌నిపోతార‌ని తెలుస్తోంది. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్క‌వుగా ఉన్న వారికి తీవ్ర ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఇక ఈ గ్యాస్ ఎక్కువుగా పిలిస్తే అది భ‌విష్య‌త్తులో కూడా మాన‌వ జీవనంతో పాటు నాడీ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌మాదం చూపుతుంద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: