ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 17 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 533కు చేరింది. అయితే జిల్లాలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. 
 
నిన్న జిల్లాలో 14 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో జిల్లాలో కరోనాను జయించిన వారి సంఖ్య 167కు చేరింది. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కరోనాను జయించిన వారందరికీ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ 2,000 రూపాయల చొప్పున నగదు పంపిణీ చేశారు. కలెక్టర్ వీరపాండియన్ జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. 
 
కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు కొత్త కేసులు నమోదు కాకుండా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: