దేశవ్యాప్తంగా వైన్ షాపుల ముందు మందుబాబులు కిలోమీట‌ర్ల క్యూ క‌డుతున్నారు. మ‌హిళలు సైతం తామేం త‌క్కువ కాదంటూ లైన్‌లో నిల‌బ‌డుతున్న ఫొటోల‌ను చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీతి సింగ్ కూడా ఓ షాపు ద‌గ్గ‌ర మందు బాటిల్ కొనేసిందంటూ ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. అస‌లు విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ర‌కుల్ ముంబైలో ఉంటోంది. ఈ క్ర‌మంలో ఆమె బాంద్రాలోని మెడిక‌ల్ స్టోర్‌కు వెళ్లి, అక్క‌డ త‌న‌క‌వ‌స‌ర‌మైన సిర‌ప్ బాటిల్స్ స‌హా కొన్ని మందులు తీసుకుని రోడ్డు దాటి వెళ్లిపోయింది. దీన్ని ఓ వ్య‌క్తి వీడియో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

 

అయితే  కొంద‌రు.. ఆమె మందు బాటిల్‌ తీసుకెళుతుందంటూ అస‌త్య ప్ర‌చారానికి దిగుతున్నారు. 'ర‌కుల్ కూడా మందు షాపులు ఎప్పుడెప్పుడు తెరుస్తారా? అని ఎదురు చూసిందం'టూ పుకార్ల‌కు దిగుతున్నారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన హీరోయిన్ అభిమానులు 'మందు షాపున‌కు, మెడిక‌ల్ షాపున‌కు తేడా తెలియ‌ట్లేదా?'  అని విరుచుకుప‌డుతున్నారు. 'నిజానిజాలు తెలుసుకుని మాట్లాడండి' అంటూ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: