విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది.  ఆ భయంకరమైన వాయువతో  వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఈ విష వాయువతో పశుపక్ష్యాదులు పిట్టల్లా రాలిపోతున్నాయి.  మనుషుల మరణాలు కూడా భారీగానే పెరిగే అవకాశం ఉందంటున్నారు.

 

విశాఖ దుర్గటనపై పలువురు నేతలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ కావడం దురదృష్టకరమని సీఎం అన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. సుమారు 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పశువులు, పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. సొమ్మసిల్లి రోడ్లపైనే పడిపోయారు. మొత్తానికి విశాఖ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: