విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి మ‌రోసారి గ్యాస్ లీక్ అయింది. చుట్టుపక్క‌ల వారు వెంట‌నే త‌మ ఇండ్ల‌ను ఖాళీ చేయాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చుట్టుప‌క్క‌ల వారు ప్రాణాల కోసం ప‌రుగులు పెడుతున్నారు. ప్ర‌స్తుతానికి గ్యాస్ లీక్ ఆగిపోయింద‌ని, మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ప్ర‌క‌టించిన కాసేప‌టికే గ్యాస్ మ‌రోసారి లీక్ అవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో స‌హాయ‌క చ‌ర్య‌లను చేప‌డుతున్న పోలీసులు, స‌హాయ‌క సిబ్బంది ప‌రుగులు తీస్తున్నారు.

 

మ‌రోప‌క్క విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువులు లీక్ అయిన నేపథ్యంలో ఆ కంపెనీ చుట్టుపక్కల రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. సింహాచలం స్టేషన్ సమీపంలో అధికారులు రైళ్లను నిలిపివేశారు. కొన్ని రైళ్లను దారిమళ్లిస్తుండగా.. మరికొన్ని రైళ్ల వేగాన్ని నియంత్రి స్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఇవాళ తెల్లవారుజామున విషవాయువులు లీక్ అవ్వడంతో దాదాపు 200 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: