విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురం లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది.  ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ తయారీ కంపెనీ ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుండి విషవాయువు ఒక్కసారిగా భారీ మొత్తంలో విడుదల కావడంతో చుట్టుపక్కల గ్రామాలోని  ఎంతో మంది ప్రజలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయారూ . పదుల సంఖ్యలో ప్రాణనష్టం కూడా జరిగిపోయింది. ఇప్పటికే ఈ విశాఖలో  ఉన్న పరిస్థితులను మంత్రులు ఎమ్మెల్యేలు సమీక్షించి ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ చర్యల కోసం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ప్రమాదంపై కమిటీని వేశారు. కలెక్టర్, సిపీ ల తో కూడిన ఓ విచారణ కమిటీ ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: