ఏపీ సీఎం వైయస్ జగన్మోహన రెడ్డి విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన గురించి స్పందించారు. చనిపోయిన 9 మంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని అన్నారు. వెంటిలేటర్ పై ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. 
 
మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. సీఎం ఈరోజు చోటు చేసుకున్న ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు కోలుకునేంతవరకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. బాధితులందరికీ ప్రభుత్వం చికిత్స చేయిస్తుందని ప్రకటన చేశారు. మంత్రులు, అధికారులు బాధితులకు, ఐదు గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: