ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎల్.జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని చెప్పారు. ఈరోజు విశాఖలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించారు. వెంటిలేటర్ పై ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, స్వల్ప అస్వస్థతకు గురైన వారికి 25,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. 
 
గ్యాస్ ప్రభావిత గ్రామాలలో ఉన్న 15,000 మందికి 10,000 రూపాయల చొప్పున అందజేస్తామని అన్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించారని వారిని సీఎం అభినందనలు తెలిపారు. కలెక్టర్ ఇతర అధికారులు ఉదయం 4.30 గంటలకే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. 340 మందిని ఆస్పత్రులకు తరలించామని... 9 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తున్నామని తెలిపారు. 
 
కమిటీ నివేదిక పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎల్.జీ సంస్థ ప్రమాణాలు పాటిస్తుందని అక్కడ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: