విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున 3.30 నిమిషాలకు  భారీ ప్రమాదం జరిగింది. ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రజలకు ఈ పాడు విషవాయువు గురించి తెలియదు.. తీరా తెలిసేలోపే జరగాల్సిన అనర్థం మొత్తం జరిగిపోయింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది.  ఆ భయంకరమైన విష వాయువు పీల్చడంతో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యి మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. 

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కంపెనీకి ఐదు కిలోమీటర్ల  పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంత మంది రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు.  విశాఖ కేజీహెచ్‌లో 187 మందికి చికిత్స అందిస్తున్నారు. అపోలోలో 48, విశాఖ సెవెన్ హిల్స్‌లో 12 మందికి, ఇతర ఆసుపత్రుల్లో మిగతావారికి చికిత్స అందిస్తున్నారు.

ఇక  గ్యాస్‌ లీక్ వల్ల 22 పశువులు, 6 కుక్కలు మృతి చెందాయని అధికారులు ప్రకటించారు. అస్వస్థతకు గురైన 62 పశువులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలోని గ్యాస్‌ లీకేజీ ప్రాంతాల్లో కనపడుతున్న దృశ్యాలు హృదయవిదారకంగా వున్నాయి.

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: