ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం గురించి సీఎం జగన్ కు ప్రాథమిక నివేదిక అందినట్టు తెలుస్తోంది. నివేదికలో ఫ్యాక్టరీ యజమానుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేలినట్టు సమాచారం. ఈ ఘటనపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందాల్సి ఉంది. 
 
పూర్తి నివేదిక అనంతరం ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు సీఎం జగన్ బాధితుల కుటుబాలకు భారీ స్థాయిలో నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. వెంటిలేటర్ సహాయంతో చికిత్స తీసుకునేవారికి 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించారు. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి 25,000 రూపాయలు, ప్రభావిత గ్రామాల ప్రజలకు 10,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: