ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశంలోని అన్ని రాష్ట్రాల క‌న్నా ఎక్కువుగా నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రంగా అమ‌లు చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ ప్ర‌భుత్వ‌మే అని చెప్పాలి. సీఎం కేసీఆర్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కంటే ముందుగానే లాక్ డౌన్ పొడిగిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతూ ప్ర‌జల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్తో సంబంధం లేకుండా తెలంగాణలో ఈ నెల చివ‌రి వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించారు. 

 

ఇక నిన్నటి వ‌ర‌కు అక్క‌డ మ‌ద్యం అమ్మ‌కాల‌పై ఉన్న నిబంధ‌న‌లు తొల‌గించ‌డంతో తెలంగాణ‌లో మందుబాబులు నెల‌రోజులుగా నాలిక‌మీద మందు ప‌డ‌క‌పోవ‌డంతో ఆగ‌లేక‌పోయారు. ఒక్కసారిగా మద్యం దుకాణాల ముందు పోటెత్తారు. తొలి రోజు ఏకంగా రు. 180 కోట్ల మ‌ద్యం అమ్ముడైంది. చివ‌ర‌కు అమ్మాయిలు... కాలేజ్ విద్యార్థినిలు, సాఫ్ట్‌వేర్ అమ్మాయిలు సైతం క్యూలో ఉండి మ‌రీ మందు కొనుక్కున్నారంటే మ‌ద్యం అమ్మ‌కాలు ఏ రేంజ్‌లో జ‌రిగాయో అర్థం చేసుకోవ‌చ్చు. 

 

ఇక రెండో రోజు గురువారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఉన్న డేటాను బ‌ట్టి చూస్తే ఇప్ప‌టికే రు. 60 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగాయ‌ని తెలుస్తోంది. అంటే రెండు రోజులు కూడా పూర్తి కాక‌ముందే తెలంగాణ‌లో మొత్తం రు. 240 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. దీనిని బ‌ట్టి అక్క‌డ మందు బాబులు పీపాల‌కు పీపాలుగా మందు తాగేస్తున్నార‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: