విశాఖపట్టణం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందినవారి తొమ్మిదికి చేరింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వైజాగ్ నగరంలో తీవ్ర విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదైంది. వేకువ జామున ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి లీకైన విషవాయువు తీవ్ర ప్రభావం చూపింది.  వందల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.

 

అయితే ఈ దుర్గటనలో చనిపోయిన వారి వివరాలు...  కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణమూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు చంద్రమౌళి విశాఖపట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్‌ తొలి ఏడాది చదువుతున్నాడు. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో వుండడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఏపీ సీఎం జగన్ పర్యటన అనంతరం ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: