మాలీవుడ్ లో సూపర్ స్టార్ మమ్ముట్టికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగు లో కూడా కొన్ని డబ్బింగ్ చిత్రాలు రిలీజ్అయ్యాయి. కోలీవుడ్ లో మోహన్ లాల్, మమ్ముట్టి మంచి సూపర్ స్టార్లు. ఇక మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా వెండి తెరకు పరిచయం మంచి హిట్ చిత్రాలు తనక ఖాతాలో వేసుకుంటున్నాడు. ఆ మద్య నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేషన్ పాత్రలో నటించి తెలుగు వారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. మాలీవుడ్ లో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆయన, నేరుగా తెలుగులో ఒక సినిమా చేయడానికి అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. తాజాగా తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ కాంబినేషన్లో ప్రాజెక్టు ఓకే అయిందనేది తాజా సమాచారం. ఇటీవలే హను రాఘవపూడి ఆయనకి కథను వినిపించగా , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.