ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం ఓదార్చారు. కేజీహెచ్ ఆస్పత్రిలో వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. 

 

IHG

 

బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ దుర్ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు.  బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని... వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు.

 

IHG

 

కేజీహెచ్ లో బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం జగన్ ఆంధ్రా మెడికల్ కళాశాల డిజిటల్ క్లాస్ రూంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా దాదాపు 340 మంది అస్వస్థతకు గురయ్యారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: