మెరుగా కాంపౌండ్ నుండి వచ్చిన యువ హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ముకుందతో తన నటనా ప్రతిభను కనబరిచాడు. ఆతరువాత వచ్చిన లోఫర్ కొద్దిగా నిరాశ పరచినప్పటికీ మిగతా సినిమాల్లో మంచి సక్సెస్ అందుకున్నాడు. వరుణ్ నటించిన గద్దల కొండా గణేష్ చిత్రం అతని కెరీర్ లో మంచి మైలు రాయి. ఆ సినిమా తరువాత బాక్సింగ్ నేపథ్యంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ లాక్ డౌన్ తరువాత ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

IHG

 

అయితే ఈ మెగా హీరో తన ఫస్ట్ లవ్ గురించి ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. తాను స్కూల్ చదివేరోజుల్లో ఓ అమ్మాయి ని ఇష్టపడ్డట్లు చెప్పాడు. అయితే తనకున్న బిడియంతో ఆమెతో మాట్లాడలేక పోయానని చెప్పాడు...ఆ అమ్మాయి ధర్యం చేసి నాకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిందని అయినప్పటికీ ఆమెతో ఫోన్లో సరిగా లవ్ ఎక్స్ ప్రెస్ చేయలేక పోయేవాడిని ..ఇలా కొన్ని రోజులు జరిగాక ఇద్దరం మాట్లాడుకోకుండా ఉండిపోయానని చెప్పాడు. తద్వారా మేమిద్దరం తెలియకుండానే విడిపోయామని ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: