ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి దేశంలో మూడు ఘోర ప్రమాదాలు జరిగాయి. ఉదయం మూడున్నర గంటలకు విశాఖలోని ఎల్.జీ పాలిమర్స్ కంపెనీలో స్టైనేడ్ అనే విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా వందలాది మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మూగజీవాలు చనిపోగా చెట్ల రంగు మారిపోయింది. మరోవైపు ఈరోజు ఛత్తీస్ గడ్ లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీకైంది. 
 
పేపర్ మిల్లు గ్యాస్ లీకేజీ ఘటనలో ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు పేపర్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేసుకుని యజమానిని అరెస్ట్ చేశారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ప్లాంట్ లో బాయిలర్ పేలిపోగా ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకేరోజు మూడు ఘటనలు చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఒకే రోజు వేరువేరు రాష్ట్రాలలో మూడు ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.    

మరింత సమాచారం తెలుసుకోండి: