ఉత్తరప్రదేశ్‌లో కరోనా మహమ్మారి జర్నలిస్టును బలితీసుకుంది. కోవిడ్‌-19 బారిన పడి ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్‌ మరణించినట్టు ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ‘కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన జర్నలిస్ట్‌ను ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీలోని ఐసోలేషన్‌ వార్డులో చేర్పించాం. బుధవారం నుంచి వెంటిలేటర్‌ మీద ఉన్న బాధితుడు చనిపోయాడ’ని ఆయ‌న చెప్పారు. 

 

కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 3,071 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 62 మంది మృత్యువాత పడ్డారు. కరోనా బారిన పడి 1,250 మంది కోలుకున్నారు.  కాగా, దేశంలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదు కాగా, 103 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మాచారం ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటివరకు 56,342కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 1,886కి పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: