ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒక్కటే.. కరోనా వైరస్.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచం మొత్తం కరాళ నృత్యం చేస్తుంది. ఎక్కడ చూసినా కరోనా మరణాలు.. కరోనా కేసులే.  అయితే చైనాలో గబ్బిలాలు తినడం వల్లే ఇలాంటి దిక్కుమాలిన కొత్త రోగాలు వస్తున్నాయని వార్తలు వచ్చాయి. దాంతో అక్కడ గబ్బిలాల మంసం విక్రయం పూర్తిగా నిషేదించారు. ఇప్పుడు గబ్బిలాలు వరుసగా చనిపోవడం భయాందోళనకు గురి చేస్తుంది. అది ఎక్కడో కాదు.. భారత దేశంలోనే కావడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది.  వివరాల్లోకి వెళితే.. న ఉత్తరప్రదేశ్‌లో  మీరట్ శివారు గ్రామమైన మెహ్రోలీలోని నీటి గుంటలో ఏప్రిల్ 29న పదుల సంఖ్యలో గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి.

 

అసలే కరోనా మహ్మారితో నానా అవస్థలు పడుతుంటే.. ఈ గబ్బిలాల మరణాలు అక్కడి ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. దాంతో వెంటనే అటవిశాఖ వారికి సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని గబ్బిలాల నమూనాలను బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)కి పంపించారు. వాటి మీద ఐవీఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి కరెంట్ షాక్ తగలడం వల్లే గబ్బిలాలు మరణించాయని ధృవీకరించారు. 

 

అయితే మెహ్రోలి గ్రామస్తులు మాత్రం గబ్బిలాల చావులో ఏదో మర్మం ఉందని.. ఒక్కసారే అన్ని ఎలా చనిపోతాయని.. వాస్తవానికి  గబ్బిలాల మృతదేహాలు లభ్యమైన ప్రాంతంలో ఎలాంటి కరెంట్ లైన్ లేదని అంటున్నారు. అంతే కాకుండా ఒకవేళ కరెంట్ షాక్ కారణంగానే అవి చనిపోతే.. అక్కడ ఉన్న మిగతా జంతువులు ఎందుకు చనిపోలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై లోతుగా అద్యయనం చేస్తే మంచిదని బావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: