ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈ ఉదయం గ్యాస్ లీక్ కావడం ప్రమాదం జరిగింది.  గ్యాస్ భారీ ఎత్తున లీక్ కావడంతో దాని ప్రభావం ఐదు గ్రామాలపై పడిన సంగతి తెలిసిందే.  ఈ గ్యాస్ ను పీల్చిన ప్రజలు సృహతప్పి పడిపోయారు.  ఈ ఘటనలో ఇప్పటికే 12 మంది మృతి చెందారు.  యావత్ ప్రపంచం మొత్తం ఈ ఘటనపై ఒక్కసారే ఉలిక్కి పడింది.. అసలే కరోనాతో నానా తంటాలు పడుతుంటే ఈ గ్యాస్ లీక్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయని సానుభూతి తెలిపారు.  సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ఎంతో మంది బాధితులకు సానుభూతి ప్రకటించారు.

 

 

ఇదిలా ఉంటే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఈ సంఘటనపై వెంటనే ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.  గుజరాత్ నుంచి తీసుకు వచ్చిన 500 కిలోల రసాయనం పీటీబీసీని వినియోగించి గ్యాస్ లీక్ ను అరికట్టేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అర్లీ ఎడ్యుకేషన్ రీసెర్చి (ఎన్ఈఈఐఆర్)కు చెందిన నిపుణుల బృందం నిరంతరం పని చేస్తోందని అన్నారు.  ఈ ఘటనా స్థలానికి పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెప్పారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: