ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏమాత్ర‌మూ త‌గ్గ‌డం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. నేడు కొత్తగా రాష్ట్ర‌వ్యాప్తంగా 54 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరుకుంది. గత 24 గంటల్లో 7,320 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 54 మందికి కరోనా వైర‌స్‌ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. కొత్తగా అనంతపురం జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 11, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి.

 

కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 842 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 41 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,004 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 1,56,681 కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా, క‌ర్నూలులో అత్య‌ధికంగా 547 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే, గుంటూరులో 374, చిత్తూరులో 374, చిత్తూరు 85, విజ‌య‌న‌గ‌రంలో 4 కేసులు న‌మోదు అయ్యాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: