సాధారణంగా జన్యూ లోపంలో అవిభక్త కవలలను చూస్తుంటాం. దేహం ఒక్కటే అయినా రెండు తలలు, చేతులు, కాళ్లతో ఉంటారు. తెలుగు రాష్ట్రంలో వీనా, వాణి పేర్లు గుర్తున్నాయి కదా.  ఇలా ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ ఇలా జన్మిస్తుంటారు.  అయితే ఇది కేవలం మనుషులే కాదు.. జీవరాశుల్లో కూడా కనిపిస్తుంది.  ఇక మనిషి పాము అంటే ఎంత కంగారు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  విష సర్పాలు అంటే దూరంగా పారిపోతుంటారు. మనిషి పాము చూస్తే ఎంత భయపడతారో.. అంతే భక్తితో ఉంటారు. సాధారణంగా పది తలల పాములు ఉంటాయని.. అవి దైవసమానం అని ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి.  కొంత మంది గ్రాఫిక్ మాయాజాలంతో ఇలాంటివి సృష్టిస్తుంటారు.  

 

తాజాగా ఒడిశాలో రెండు తలలతో కనిపించిన పాము జనాలను ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ఈ పాముకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద చాలా ప్రత్యేకమైన వీడియలో నేచర్, జంతువుల, పక్షులు, పాములకు సంబంధించిన అపురూపమైన వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా నేల మీద పాము పాకుతుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రెండు తలలు కలిగిన ఈ పామును ఒడిశా కియోంజార్ జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో గుర్తించారు. ఆ తర్వాత దాన్ని అడవిలో సురక్షితంగా వదిలేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: