కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా రెండు నెలలుగా అవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలు ఈ వైరస్ ఎలా అంతం అవుతుంది అని భయం భయం తో రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. మన దేశంలోనూ కూడా లాక్ డౌన్ గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఉంటే మన దేశంలో మాత్రం ప్రజలు శృంగారంలో... పిల్లలను క‌నే పనిలో బిజీ బిజీగా ఉన్నారట. ప్రస్తుతం సంక్షోభ సమయంలో దేశంలో ఉన్న ప్రజలందరూ చాలా వరకు తమ పనులు మానుకుని ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారు శృంగారంలో బిజీ బిజీగా ఉంటున్నారట. 

 

దీంతో ఈ సంక్షోభ సమయంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా మన దేశంలో ఎక్కువ నమోదు కాబోతున్నాయి ఇది ప్రపంచంలోనే అరుదైన రికార్డు గా నిలిచి పోతున్నది. వచ్చే  తొమ్మిది నెలల కాలంలో ప్రపంచం 11.60 కోట్ల మంది శిశువులు పుట్టే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. వారిలో దాదాపు 2 కోట్లమంది భారతదేశంలో పుడతారు. అంటే లాక్ డౌన్ వేళ ప్ర‌పంచ వ్యాప్తంగా పుట్టే కొత్త జ‌న‌నాల‌లో ఐదో వంతు మ‌న‌దేశంలోనే న‌మోదు అవుతున్నాయి. ఈ విష‌యంలో మ‌న దేశం చైనాను కూడా మించి పోయి స‌రి కొత్త రికార్డును త‌న పేరిట లిఖించు కోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: