క‌న్న తల్లి న‌వమాసాలు మోసి పేగు నుంచి పుట్టిన ఆ కొడుకు క‌న్న కొడుకు అనే ప‌దానికే మాయ‌ని మ‌చ్చ తెచ్చాడు. పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి... మ‌న‌వ‌ళ్ల‌ను ఎత్తుకుని ఆడించిన పాపానికి ఆ క‌న్న‌త‌ల్లిని కొడుకు బ‌తికుండ‌గానే భూమిలో పాతి పెట్టాల‌ని చూశాడు. ఈ కొడుకును దుర్మార్గుడు అన‌డం క‌న్నా అంత‌కు మించిన ప‌దాలు ఏవైనా ఉంటే వాటితోనే తిట్టాలేమో..? మూడు రోజుల తర్వాత ఆమెను బయటకు తీసి రక్షించిన ఘటన ఉత్తర చైనాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

చైనాకు చెందిన యాన్ అనే వ్యక్తి తల్లి వాంగ్ పాక్షిక పక్షవాతంతో బాధపడుతోంది. మంచానికే ప‌రిమితం అయిన త‌ల్లిని చూడ‌డం భారంగా భావించిన ఆమె కుమారుడు ఆమెను ఓ బండిలో బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి భూమిలో పాతి పెట్టాడు. అయితే యాన్ భార్య‌కు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు యాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. తల్లిని చూసుకోవడం తన వల్ల కాదని అందుకే ఆమెను బతికుండగానే పాతిపెట్టినట్టు ఒప్పుకున్నాడు. 

 

వెంట‌నే పోలీసులు ఆ త‌ల్లిని పాతిపెట్టిన స‌మాధి వ‌ద్ద‌కు వెళ్ల‌గా అప్ప‌టికే బాగా నీర‌సించిన ఆ త‌ల్లి స‌హాయం కోసం నెమ్మ‌దిగా అరుపులు వేస్తోంది. పోలీసులు ఆ ప్రదేశాన్ని తవ్వి ఆమెను రక్షించారు. శరీరమంతా మట్టికొట్టుకుపోయి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: