దేశంలో కరోనా వైరస్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి దీన్ని నిర్మూలించడానికి నానా తంటాలు పడుతున్నారు.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులు ఎంతగా సేవలు చేస్తున్నారో.. అదే స్థాయిలో ప్రజలకు న్యూస్ చేరవేస్తున్న  మీడియా సిబ్బంది కూడా అంతే కష్టపడుతున్నారు.  దేశంలో ఈ మూల ఏం జరగుతుందో వెళ్లి చూసి అది ప్రజలకు చేరవేస్తున్నారు. అలాంటి జర్నలిస్టులకు సైతం కరోనా భారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఢిల్లీలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడటంతో అవసరమైన సాయం చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

 

ఇటీవల సీఎం కేసీఆర్ సైతం మీడియా మిత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.  తాజాగా  ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం  రూ.12 లక్షలు  విడుదల చేసింది. కొందరు ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ తేలడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాజిటివ్ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.75 వేలు తక్షణసాయం అందిచనుంది. ఢిల్లీలో పరిస్థితిని తెలంగాణా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్ పర్యవేక్షిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: