దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో క‌రోనా వైర‌స్ విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. మ‌ర‌ణాలు ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి. ఈ న‌గ‌రంలోనే సామాన్య ప్ర‌జ‌ల‌తోపాటు వైద్యులు, న‌ర్సులు, పోలీసులు, జ‌ర్న‌లిస్టులు, పారిశుధ్య కార్మికులు అధిక సంఖ్య‌లో వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) కమిషనర్ ప్రవీణ్ పర్దేషిపై రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌దిలీ వేటు వేసింది. పట్టణాభివృద్ధి విభాగంలో అదనపు సిఎస్‌గా ఆయ‌న‌ను బదిలీ చేసింది. ఆయ‌న స్థానంలో ఇక్బాల్ చాహల్‌ను బిఎంసి క‌మిష‌న‌ర్‌గా నియ‌మించింది. నగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో క‌మిష‌న‌ర్ విఫ‌లం చెందార‌న్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

 

ఇక ముంబైలో ఇప్పటివరకు 11,219 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 437 మరణాలు సంభ‌వించాయి. మహారాష్ట్రలోనేకాదు దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అత్య‌ధికంగా ఉన్న న‌గ‌రాల్లో ముంబై మొద‌టిస్థానంలో ఉంది. అలాగే.. ధారావిలో ముంబైలోని ధారావిలో 25 కొత్తగా కొవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 808కు, మరణాల సంఖ్య 26 కి చేరుకుందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: