దేశంలో కరోనా వైరస్ ఎప్పుడైతే మొదలైందో ఆనాటి నుంచి మెల్లి మెల్లిగా పెరిగిపోతు న్నాయి.  ఫిబ్రవరి లో ఈ కరోనా మహమ్మారి మొదలై ఇప్పటి వరకు వేల సంఖ్యకు చేరిపోయింది.  దేశంలో ఎక్కువగా కరోనా కేసులు మహరాష్ట్రలో నమోదు అవుతుంటే.. కేరళా, ఉత్తరాఖాండ్ లాంటి రాష్ట్రాల్లో జీరో కేసులు నమోదు అయ్యాయి.  అయితే కరోనా వ్యాప్తి జరగడానికి ముఖ్యకారణం సామాజి దూరం పాటించకపోవడం.. కరోనా లక్షణాలు ఉన్నవారు మన మద్య తిరగడం.. మాస్కు లు ధరించకపోవడం... ఇలా ఎన్నోకారణాల వల్ల కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  ఇక జమ్మూ-కాశ్మీర్‌లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి.  జమ్మూలో 13, కాశ్మీర్‌లో 437గా వివరించింది.

 

ఇదిలా ఉంటే రెండు ప్రాంతాల్లో కరోనా కారణంగా మొత్తం 9 మంది మరణించగా.. వారిలో కాశ్మీర్‌ పరిధిలో 8, జమ్మూలో ఒకటి మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.  తాజాగా 30 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటితో కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్-19 కేసుల సంఖ్య 823కు పెరిగిందని, అయితే వీటిలో 755 కేసులు కాశ్మీర్‌లోనూ, 68 జమ్మూలోనూ నమోదయ్యాయని తెలిపింది.

 

అక్కడ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వైరస్ వ్యాప్తిని మాత్రం ఎక్కడా అరికట్టలేక పోతున్నారు. దాంతో లాక్ డౌన్ మరింత కఠినం చేయడానికి సిద్దమవుతున్నారు.   మొత్తంగా 373 మంది కోలుకోగా.. వారిలో కాశ్మీర్‌ పరిధిలో 318 కోలుకున్నారని వెల్లడించింది. ఇదిలా ఉంటే రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 450 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. అవి వరుసగా.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: