చైనా ఈ పేరు వింటే ఇప్పుడు ప్రపంచ దేశాలు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాయి.  చైనాలోని పుహాన్ లో కరోనా వైరస్ పుట్టుకొచ్చి ప్రపంచ దేశాలన్నింటిని కన్నీటి పాలు చేస్తుంది.  అభివృద్ది లో చైనా ఎంత గొప్పగా ముందుకు పోతుంతో ఇప్పుడు అంతే చెడ్డ పేరు తెచ్చుకుంది. చాలా దేశాలు ఈ కరోనా వైరస్ కి కారణం చైనా అని.. అక్కడ చేసిన ప్రయోగాల ఫలితమే ఈ మాయదారి కరోనా అని రక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ చైనా మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తుంది.  తాజాగా చైనా ప్రయోగాత్మక అంతరిక్ష నౌక శుక్రవారం విజయవంతంగా ల్యాండ్ అయింది.  మంగళవారం దీనిని ప్రయోగించగా, ముందుగా నిర్దేశించిన సైట్‌కు ఇది క్షేమంగా చేరుకున్నట్టు చైనా మ్యాన్‌డ్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.

 

అంతరిక్ష నౌక క్యాబిన్ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉన్నట్టు పేర్కొంది.   అంతరిక్షంలో శాశ్వత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి, చంద్రుడిపైకి మానవులను పంపేందుకు ఉద్దేశించి చైనా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అంతరిక్ష కక్ష్యలో రెండు రోజుల 19 గంటలు ఉందని, అనేక పరిశోధనలు పూర్తి చేసిందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రయోగం తో తాము మరిన్ని పరిశోధనలు చేయడానికి పనికి వస్తుందని.. అంతరిక్ష నౌకలు తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, నౌక తిరిగి రావడం ద్వారా ఉష్ణ నిరోధకత సామర్థ్యాలను ధ్రువీకరించిందని వివరించింది.

 

ఇదిలా ఉంటే.. చైనా అన్ని దేశాలకు ముందు వరుసలో ఉండాలని.. 2022 నాటికి చైనా పూర్తి చేయాలనుకుంటున్న స్పేస్ స్టేషన్‌కు స్పేస్‌షిప్ ఏదో ఒక రోజు వ్యోమగాములను మోసుకెళ్తుందని ఏజెన్సీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: