దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ జిహాద్ అనే పదాన్ని ఏదో ఒక సందర్భంలో వింటూ ఉంటారు. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. ఈ జిహాద్ పై ముస్లిం సమాజంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాధువుల మీద దాడి జరిగినందుకు అర్నాబ్ కొన్ని కేసులు నమోదైతే జిహాద్ పై చర్చ పెట్టినందువల్ల జీ న్యూస్ కు సంబంధించిన సుధీర్ చౌదరిపై కేసు నమోదైంది. కేరళ పోలీసులు సుధీర్ కుమార్ పై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేశారు. 
 
పోలీసులు కేసులో ముస్లింల మనోభావాలను దెబ్బ తీశాడనే కారణంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కోజికడ్ లోని కసాబా పోలీస్ స్టేషన్ ఐపీసీ సెక్షన్ 295 ఏ కింద కేసు నమోదు చేసింది. సుధీర్ చౌదరి చర్చ ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని... సుధీర్ చౌదరి జిహాద్ ను ప్రమాదకర విషయంగా పేర్కొన్నారని తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీశారనే ఆరోపణలతో వీరి ఇద్దరిపై కేసులు నమోదు కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: