ఓవైపు క‌రోనా దెబ్బ‌కు అన్నిరంగాలు కుదేల‌వుతున్నాయి. ఉద్యోగాల్లో కోత‌లు పెడుతున్నాయి. చాలావ‌ర‌కు జీతాలు కూడా ఇవ్వ‌డం లేదు. కానీ..  ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్రెష‌ర్ల‌కు ఏకంగా 20వేల ఉద్యోగాలు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంటే.. కరోనా కార‌ణంగా కాగ్నిజెంట్ కూడా దెబ్బ‌తిన్న‌ది.‌ నికర లాభం ఈ మార్చి క్వార్టర్‌లో 17 శాతం తగ్గింది. గత ఏడాది మార్చి క్వార్టర్‌లో 44 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 37 కోట్ల డాలర్లకు తగ్గిందని సంస్థ‌‌ తెలిపింది. ఆదాయం 3 శాతం వృద్ధితో 420 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ బ్రియాన్‌ హంఫ్రీస్‌ వెల్లడించారు.

 

కరోనా వైరస్ కార‌ణంగా ఈ ఏడాది డిమాండ్‌ పరంగా సమస్యలు ఉండొచ్చని అంచనాలున్నాయన్నారు. అందుకే గతంలో వెలువరించిన ఈ ఏడాది ఆదాయ అంచనాలను వెనక్కి తీసుకుంటున్నామని వివరించారు. అయినా తాము ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌తో కరోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.  మార్చి క్వార్టర్‌లో భారీ డీల్స్‌ సాధించామని బ్రియన్‌ వివరించారు. ఈ సంద‌ర్భంగానే ఫ్రెషర్లకు 20,000 ఉద్యోగాలు ఇవ్వనున్నామని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: