హైదరాబాద్‌ గాంధీ దవాఖాన వైద్యులు కరోనా వైర‌స్‌ పాజిటివ్ సోకిన గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన మహిళ (22) ప్రసవం కోసం పేట్లబుర్జు ప్రసూతి దవాఖానను ఆశ్రయించింది. ఆమెలో కరోనా లక్షణాలు ఉండటంతో అప్ర‌మ‌త్తం అయిన వైద్యులు వెంట‌నే ఆమె క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. ఆ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను మూడురోజుల క్రితం గాంధీకి తరలించారు. పాజిటివ్‌ గర్భిణికి సాధారణ ప్రసవం చేస్తే ప్రమాదం పొంచి ఉండటంతో వైద్యులు శుక్రవారం శస్త్రచికిత్స ద్వారా ప్రసవంచేయగా, మగ శిశువు జన్మించాడు.

 

ఇక ఇద్దరినీ వేర్వేరు వార్డుల్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శిశువుకు శనివారం వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్టు గాంధీ ద‌వాఖాన‌ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. ఈ నేప‌థ్యంలో అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.  ఇటీవల 23 రోజుల బాలుడికి కిడ్నీ, గుండె తదితర సమస్యలతో బాధపడుతున్న 87 ఏండ్ల వృద్ధుడికి మెరుగైన చికిత్స అందిండంతో కరోనా వైర‌స్‌ నుంచి కోలుకొన్న విషయం తెలిసిందే. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: