అత్యాధునికి సాంకేతిక‌త‌ను వినియోగించుకోవ‌డంలో హైద‌రాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందే ఉంటారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌లు సాంకేతిక టెక్నిస్‌తో నిబంధ‌న‌లను ఉల్లంఘించిన వాహ‌నాల‌ను గుర్తిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా.. మాస్క్‌లు ధ‌రించ‌ని వారిని కూడా గుర్తించేందుకు హైద‌రాబాద్ పోలీసులు మ‌రో టెక్నిక్‌ను వినియోగిస్తున్నారు. ప్ర‌తీ ఒక్క‌రు మాస్క్‌ధ‌రించాల‌ని ప్ర‌భుత్వాలు, అధికారులు ప‌దేప‌దే చెబుతున్నాయి. జ‌రిమానా కూడా విధిస్తామ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నాయి. అయినా కొంద‌రు మాస్క్ లేకుండానే బ‌య‌ట‌తిరుగుతున్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలతో డీప్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌ను ఉపయోగిస్తున్నారు.

 

ఈ టెక్నిక్‌తో మాస్కులు లేకుండా బయటికి వచ్చేవారి ఫొటోలను తీస్తున్నారు. ఈ- చలాన్‌ మాదిరిగానే వాహనదారులకు వాటి నంబర్‌ ఆధారంగా వారి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపిస్తారు. నిర్ణీత సమయంలో చలాన్లు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. మాస్క్‌ లేకుండా తిరిగేవాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం తన ట్విట్టర్‌లో వివరించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు తీసుకొచ్చిన ఈ టెక్నాలజీని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో అమలుచేస్తున్నట్టు ఆయ‌న తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: