ఆంధ్రప్రదేశ్ లో మరో స్వతంత్ర సంస్థకు నేడు తుది రూపం రానుంది. మద్యం ఇసుక అక్రమాల నిరోధంపై ప్రత్యేక వ్యవస్థకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్  బ్యూరో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పూర్తి స్థాయి స్వతంత్ర సంస్థగా పని చేయనుంది ఈ సంస్థ.

 

ఈ వ్యవస్థ కింద ఎక్సైజ్ శాఖలో ఉండే అధిక భాగం సిబ్బంది పని చేస్తారు. నేడు దీనికి తుది రూపం వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సరిహద్దు జిల్లాల్లో ఐపిఎస్ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తారు. డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ స్థానంలో కమీషనర్, స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో పని చేయనుంది. ఇంటలిజెన్స్, ఏసీబీ లాగే ఇది పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: