విశాఖపట్నంలోని గోపాలపట్నం వద్దగల పరిశ్రమలో స్టైరీన్‌ విష వాయువు లీకేజీ యావత్ బారత దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.  ఓ వైపు కరోనా మహమ్మారి తో పోరటాం చేస్తుంటే.. ఇప్పుడు విశాఖలో కొత్త ఉపద్రవం.  గోపాలపట్నం వద్దగల పరిశ్రమలో స్టైరీన్‌ విష వాయువు ఇప్పటికీ పన్నెండు మంది చనిపోగా ఎంతో మంది దీని ప్రభావంతో సతమతమవుతున్నారు. ఇక విశాఖపట్నంలోని గోపాలపట్నం వద్దగల పరిశ్రమలో స్టైరీన్‌ విష వాయువు లీకేజీ ఘటనపై అమెరికాలోని ఐక్యరాజ్య సమితి సైతం స్పందించి . ఈ విషాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గటెరస్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

ఈ మేరకు ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి ప్రకటన వెలువరించారు.   గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఇప్పుడు ఇతర సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా, బాధితుల్లో కొందరికి ఒంటిపై బొబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడు తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత శరీరంపై దురద, మంట పుడుతున్నాయి.   మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: