అమ్మ పాలు అమృత‌మే..!  క‌రోనా వైర‌స్‌ను అడ్డుకునే శ‌క్తి త‌ల్లిపాల‌కు ఉంద‌ని అమెరికా ప‌రిశోధ‌కులు చేసిన ఓ అధ్య‌య‌నంలో తేలింది. వైర‌స్ సోకిన త‌ల్లి నిర్భ‌యంగా త‌న బిడ్డ‌కు పాలు ఇవ్వొచ్చున‌ని ఆ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. తల్లి పాలలో శిశువులకు రక్షణగా యాంటీబాడీస్ ఉంటాయ‌ని, అని క‌రోనా వైర‌స్‌ను నిర్వీర్యం చేస్తాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. నిజానికి.. మ‌రో అధ్య‌యనంలో కూడా త‌ల్లి పాల‌ద్వారా వైర‌స్ వ్యాప్తి చెంద‌ద‌ని కూడా నిర్ధారించారు. పాల‌లో ఉండే యాంటీబాడీస్ వైర‌స్ వ్యాప్తికి ప్ర‌తిరోధ‌కాలుగా ఉంటాయ‌ని పేర్కొన్నారు.

 

* కరోనా వైరస్ బారిన పడిన తల్లులు నిర్భ‌యంగా పిల్ల‌లకు పాలు ఇవ్వాలి. వైర‌స్ సోకింద‌న్న కార‌ణంగా పాలివ్వ‌కుండా ఉండొద్దు. పాలుప‌ట్ట‌డాన్ని కొనసాగించాలి, ఎందుకంటే  ఇతర పరిశోధకులు చేసిన అధ్య‌య‌నంలో కూడా పాలు ద్వారా వైర‌స్ వ్యాప్తి జరగదని నిరూపించారు. అంతేగాకుండా పాల‌లో పుష్క‌లంగా యాంటీబాడీస్ ఉంటాయ‌ని మేము క‌చ్చితంగా ఉన్నాయ‌ని నిర్ధారించాం. అవే వారి పిల్లలను వైర‌స్ నుంచి కాపాడుతాయి* అని అధ్యయనానికి నాయకత్వం వహించిన న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్‌లోని ది ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన రెబెకా పావెల్ వెల్ల‌డించారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: