కరోనా వైరస్‌తో బాధపడుతూ హైద‌రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న గర్భిణి(22)కి ఆస్పత్రి గైనకాలజీ విభాగం వైద్యులు నిన్న‌ విజయవంతంగా డెలివరీ చేశారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనిత, డాక్టర్‌ ప్రసన్నలక్ష్మి, డాక్టర్‌ సింధూ, డాక్టర్‌ మృణాళిని, డాక్టర్‌శ్రీలక్ష్మి, డాక్టర్‌ నాగార్జునలతో కూడిన వైద్య బృందం బాధితురాలికి ప్రత్యేక జాగ్రత్తల మధ్య డెలీవరి చేశారు. ఆమెకు మగబిడ్డ జన్మించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆ స్పత్రి వైద్యులు ప్రకటించారు. పుట్టిన బిడ్డకు కూడా ఈ రోజు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు.

 

ఈ ప‌రీక్ష‌ల్లో బిడ్డ‌కు నెగెటివ్ రావ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. త‌ల్లీబిడ్డ క్షేమంగా ఉండ‌డంతో అంద‌రూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.  అయితే.. త‌ల్లి బిడ్డ‌కు పాలు ఇవ్వొచ్చా..?  లేదా..? అని అంద‌రూ ఆలోచిస్తున్నారు. ఈ విష‌యంలో వైద్యులు కూడా ఎటూ తేల్చుకోలేక‌పోతున్నారు. అయితే.. ప‌లువురు వైద్యులు మాత్రం ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో త‌ల్లికి దూరంగా ఉంచ‌డ‌మే మేల‌ని సూచిస్తున్నారు. దూరంగా ఉంచి, పోష‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌సి సూచిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: