దేశంలో ఫిబ్రబరి నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి. అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల లక్షదాటిన మరణాలు, లక్షల్లో కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు అమెరికా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాల్లో నమోదు అవుతున్నాయి. ఈ మద్య రష్యాలో కూడా కేసులు పెరిగిపోతున్నాయి.  తాజాగా మన దేశంలో కేసులు రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే కరోనాకి ఇప్పటి వరకు మందు రాకపోవడంతో ఈ మహమ్మారిని ఆపడం మరీ కష్టం అవుతుంది. ఈ కరోనా రాకుండా కేవలం జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.  భౌతిక దూరం పాటించాలి.. మాస్క్ ధరించాలి.  కరోనా వ్యాధిగ్రస్తులు అన్న అనుమానం ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి.  

 

ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. తద్వారా ఇతరుల నుంచి ముక్కు, నోటి ద్వారా తమకు వైరస్ సోకకుండా జగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఓ ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు. ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు. కళ్లపై ఉన్న కంజంక్టివా అనే సన్నని పొరపై దాడి చేసి అక్కడి నుంచి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక అంచనా ప్రకారం మనిషి ప్రతి గంటకు 16 సార్లు కంటిని టచ్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో, కంటి ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: