దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారే కరోనా కారణంగా మరణిస్తున్నారని ఏపీ సిఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆయన సిఎం క్యాంపు ఆఫీస్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి 700 మంది వలస కూలీలు అనుమతి లేకుండా రాష్ట్రంలోకి వచ్చారని ఆయన పేర్కొన్నారు. వలస కూలీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు జగన్. 

 

రాష్ట్రంలో కరోనా పరిక్షలు పూర్తి స్థాయిలో చేస్తున్నామని పేర్కొన్నారు. మిలియన్ జనాభా కు 3091 పరిక్షలు చేస్తున్నట్టు జగన్ వివరించారు. విశాఖ గ్యాస్ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని జగన్ వివరించారు. టెలి మెడిసిన్ ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని జగన్ వివరించారు. కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు సిఎం.

మరింత సమాచారం తెలుసుకోండి: