ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాజీ ముఖ్య‌మంత్రి అజిత్ జోగి గుండెపోటుకు గుర‌య్యారు. ఒక్క‌సారిగా ఇంట్లోనే కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన‌ కుటుంబ స‌భ్యులు, సిబ్బంది ఆయ‌న‌ను హుటాహుటిన రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయ‌ణ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వెంటిలేట‌ర్‌పై అజిత్ జోగికి చికిత్స అందిస్తున్న‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. అతని ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంద‌ని.. ఇప్పుడే ఏమీ చెప్ప‌లేమ‌ని వైద్యులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ జోగి(74) 2000 నుంచి 2003 వ‌ర‌కు ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న కుమారుడు అమిత్ జోగి ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

 

అయితే.. మాజీ ముఖ్య‌మంత్రి అజిత్ జోగికి గుండెపోటు వ‌చ్చింద‌న్న విష‌యం తెలియ‌గానే నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వెంట‌నే ఆస్ప‌త్రికి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. లాక్‌డౌన్ కార‌ణంగా ఎవ‌రూ కూడా ఆస్ప‌త్రి వైపు వ‌చ్చే ప‌రిస్థితి లేదని ప‌లువురు అంటున్నారు. అజిత్‌జోగి త‌న‌దైన పాల‌నాతీరుతో ప్ర‌జ‌ల్లో మంచి నేత‌గా గుర్తింపు పొందారు. ప్ర‌జా సంక్షేమం కోసం ఆయ‌న అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: